Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి పలు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బెంగళూరులోని హెబ్బాళ్ సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఓ ఓల్వో బస్సు ఫ్లైఓవర్‌పై వెళ్తోంది. అయితే, ఉన్నట్టుండి డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు (Bus Driver Loses Control). దీంతో బస్సు ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ముందుగా రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది.
ఆ తర్వాత పలు కార్లను ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్సులో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో బస్సు అద్ధం స్వల్పంగా ధ్వంసమైంది. ఆ సమయంలో బ్రేక్ పెడల్ (brake pedal) కింద వాటర్ బాటిల్ ఇరుక్కున్న కారణంగా బ్రేక్ పడలేదని తెలిసింది. ఈ ప్రమాదంపైకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
The bus stopped correctly a while ago.
Was it the case of any water bottle stuck under the brake pedal?@motordave2@RSGuy_India@ReduceRoadRiskspic.twitter.com/sz4TM6QGNt— DriveSmart🛡️ (@DriveSmart_IN) August 13, 2024
Also Read..
Baba Ramdev | రామ్ దేవ్ బాబాకు భారీ ఊరట.. ధిక్కరణ కేసును ముగించిన సుప్రీంకోర్టు
GST Council meeting | 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు
Flag Hoisting: ఆ మంత్రి జాతీయ జెండాను ఎగురవేయరాదు..