GST Council meeting | వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting) తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 9వ తేదీన న్యూఢిల్లీలోని (New Delhi) విజ్ఞాన్ భవన్ (Vigyan Bhavan)లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా వెల్లడించింది. ఈ భేటీలో రేట్ల హేతుబద్ధీకరణపై (rate rationalisation) చర్చించే అవకాశం ఉంది.
జూన్ 22న 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్లో రైల్వే ప్లాట్ఫాం టికెట్లు, విశ్రాంతి గదులు, నెలకు రూ.20 వేల కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేటు హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు వర్తింపు, అన్ని పాల క్యాన్లపై జీఎస్టీని 12 శాతంగా, కార్టన్ బాక్సులపై 18 శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గింపు, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్ర, ఎరువులపై జీఎస్టీ మినహాయింపు వంటి వాటిపై నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read..
Baba Ramdev | రామ్ దేవ్ బాబాకు భారీ ఊరట.. ధిక్కరణ కేసును ముగించిన సుప్రీంకోర్టు
MP-ATGM: విజయవంతంగా ఎంపీ-ఏటీజీఎంను పరీక్షించిన డీఆర్డీవో.. వీడియో