జైసల్మేర్: డీఆర్డీవో ఇవాళ కీలక పరీక్ష చేపట్టింది. మేడిన్ ఇండియాలో భాగంగా తయారు చేసిన మాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్(MP-ATGM)ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఉన్న ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. డీఆర్డీవో అధికారులు దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు. ఎంపీ ఏటీజీఎం వెపన్ సిస్టమ్‌ను స్వదేశీయంగా డిజైన్ చేశారు. డీఆర్డీవో దీన్ని డెవలప్ చేస్తోంది. వేర్వేరు ఫ్లయిట్ ప్రదేశాల్లో ఆ లక్ష్యంతో గైడెడ్ మిస్సల్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఎంపీ ఏటీజీఎం సిస్టమ్‌లో లాంచర్, టార్గెట్ అక్విజిషన్ సిస్టమ్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉన్నాయి.
#WATCH | DRDO (Defence Research and Development Organisation) successfully test-fired the Made-in-India Man-Portable Anti Tank Guided Missile (MP-ATGM) at the field firing range in Jaisalmer, Rajasthan, recently: DRDO officials pic.twitter.com/J2AcG5LdiT
— ANI (@ANI) August 13, 2024