‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకుంది నిహారిక కొణిదెల. ఆమె నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకురాలు. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా కొత్త మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘ఇదొక ఫాంటసీ కామెడీ డ్రామా. వినూత్న కథతో ఆకట్టుకుంటుంది.
నాలుగు రోజుల టాకీ పార్ట్‌తో పాటు ఓ పాట మాత్రమే బ్యాలెన్స్‌గా ఉంది. వేసవిలో చక్కటి వినోదాత్మక చిత్రంగా అలరిస్తుంది’ అని చెప్పింది. నయన్సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్, దర్శకత్వం: మానస శర్మ.