ఊహించని సర్ప్రైజ్లు ఉంటాయి!
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం వినోదం, భావోద్వేగాల కలబోతగా ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామాగా మెప్పిస్తుందని చెప్పారు చిత్ర కథానాయికలు అషికా రంగనాథ్. డింపుల్ హయాతి. వీరిద్దరూ రవితేజ సరసన నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం వినోదం, భావోద్వేగాల కలబోతగా ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామాగా మెప్పిస్తుందని చెప్పారు చిత్ర కథానాయికలు అషికా రంగనాథ్. డింపుల్ హయాతి. వీరిద్దరూ రవితేజ సరసన నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ సందర్భంగా శుక్రవారం కథానాయికలు అషికా రంగనాథ్, డింపుల్ హయాతి విలేకరులతో ముచ్చటించారు. ఈ సినిమాలో తన పాత్రపేరు మానసశెట్టి అని, ఆధునిక భావాలు కలిగిన అమ్మాయిగా కనిపిస్తానని, ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేలా తన క్యారెక్టర్ ఉంటుందని అషికా రంగనాథ్ తెలిపింది.
స్త్రీ పురుష సంబంధాల్లోని సంఘర్షణ, భావోద్వేగాలను ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారని ఆమె చెప్పింది. కెరీర్ ఆరంభంలోనే అగ్రహీరోలతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అషికా రంగనాథ్ ఆనందం వ్యక్తం చేసింది. డింపుల్ హయాతి మాట్లాడుతూ..ఈ సినిమాలో రవితేజ భార్య బాలామణి పాత్రలో కనిపిస్తానని, ఈ కథలో ఊహించని సర్ప్రైజ్లు ఉంటాయని చెప్పింది. సెన్సిబుల్ కామెడీతో పాటు హార్ట్ టచింగ్ మూమెంట్స్‌తో సినిమా ప్రతీ ఒక్కరిని మెప్పిస్తుందని డింపుల్ హయాతి తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

