Tamil Nadu | ప్రయత్నించి ఫలితం ఆశించు అంటారు పెద్దలు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు ప్రయత్నించాలి. ఆ తర్వాత గెలుపనేది దైవాదీనం. ఇక ఆటలో గెలుపోటములు సహజం. ఇప్పుడు ఓడిపోయామని కుంగిపోకూడదు. అంతకు రెట్టింపు పట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. చదువులో అయినా, ఆటల్లో అయినా ఇదే సూత్రం పాటిస్తారు అంతా. అయితే, ఆటలో ఓడిపోయామన్న బాధలో ఉన్న పిల్లల్ని ఓదార్చి ధైర్యం చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. వారిపట్ల క్రూరంగా ప్రవర్తించాడు. విద్యార్థుల చెంపలపై బలంగా కొడుతూ.. దూషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
తమిళనాడు రాష్ట్ర సేలం (Salem) జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఫుట్బాల్ మ్యాచ్ (football players) ఓడిపోయారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పీఈటీ టీచర్ (PET Teacher) అన్ణామలై విద్యార్థులపై దాడి చేశాడు (poor performance). వారందరినీ నేలపై ఓ వరుసలో కూర్చోబెట్టి చితకబాదాడు. చెంపలపై బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా కాలితో తన్ని, జుట్టును లాగి హింసించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. సదరు ఉపాధ్యాయుడి చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ఉపాధ్యాయుడిపై చర్యలకు ఉపక్రమించారు. అతడిని విధుల నుంచి సస్పెండ్ చేసి ఘటనపై విచారణకు ఆదేశించారు.
Seriously this is not the way to treat your players 😐 pic.twitter.com/wniTRS9XlS
— Abdul Rahman Mashood (@abdulrahmanmash) August 12, 2024
Also Read..
Bengaluru | బ్రేక్ పెడల్ కిందకు వాటర్ బాటిల్.. అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. VIDEO
GST Council meeting | 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు
Doctors Protest | దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన.. రోగుల అవస్థలు