Doctors Protest | పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా (Kolkata)లో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు ఆందోళన బాట పట్టారు (Doctors Protest). ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానల రెసిడెంట్ డాక్టర్లు ఢిల్లీ, కోల్కతా, రాజస్థాన్, యూపీ సహా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కోరుతున్నారు.
వైద్యుల సమ్మెతో దవాఖానల్లో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఓపీ సేవలు, అత్యవసరం కాని సర్జరీలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల కొద్దీ ఆసుపత్రుల ముందు క్యూలో నిల్చున్నా ఫలితం లేకుండా పోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు వైద్యుల సమ్మెతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యుల సమ్మెకు అర్థం ఉందని.. మరి మా పరిస్థితి ఏంటని వాపోతున్నారు.
Also Read..
Dera Baba | జైలు నుంచి మరోసారి బయటకు వచ్చిన డేరా బాబా
ACB Raids | రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులు..