Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది (Multiple vehicles collide). ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ధర్మపురి (Dharmapuri ) జిల్లా తోప్పురు సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ధర్మపురి నుంచి సేలం వైపు వెళుతున్న ఓ లారీ జాతీయ రహదారిలోని తోప్పురు ఘాట్ రోడ్డు ( Thoppur Ghat Road)లో వంతెనపై అదుపుతప్పి ముందు వెళ్తున్న కార్లు, మరికొన్ని లారీలపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ లారీ వంతెనపై నుంచి కిందపడిపోయింది. పలు వాహనాలు సైతం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
நேற்று மாலை தர்மபுரி மாவட்டம் தொப்பூர் கணவாய் பகுதியில் மிகப்பெரிய கோர விபத்து நடைபெற்றது இதில் 4 பேர் உயிரிழந்திருக்கிறார்கள் கனரக வாகன ஓட்டுனர்கள் மிகவும் கவனமாக வாகனங்களை இறக்குங்கள்! #dharmapuri #accident pic.twitter.com/HeGQZR4RDf
— Kumar~Ayyar🔥 (@Kumar_ayyar) January 25, 2024
Also Read..
Ram Temple | అయోధ్య రామ మందిరానికి తొలి రోజు భారీ విరాళాలు.. ఎన్ని కోట్లంటే..?
Rahul Gandhi | అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ
Australia | ఆస్ట్రేలియాలో విషాదం.. బీచ్లో నీట మునిగి నలుగురు భారతీయులు మృతి