జూరాలకు వరద హోరు
జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం వరద నిరంతరాయంగా కొనసాగడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ప్రాజెక్టు వరద కొనసాగుతుండంతో ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద నిరంతరాయంగా కొనసాగడంతో 26గేట్లు ఎత్తి శ్రీశైలం వైపు నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం వరకు జూరాలకు 2,25,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు ప్రస్తుతం 317.99 మీటర్ల నీటి నిల్వ ఉంది.
- 32 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
- ఇన్‌ఫ్లో 2,25,000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,16,870 క్యూసెక్కులు
గద్వాల, ఆగస్టు 7 : జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం వరద నిరంతరాయంగా కొనసాగడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ప్రాజెక్టు వరద కొనసాగుతుండంతో ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద నిరంతరాయంగా కొనసాగడంతో 26గేట్లు ఎత్తి శ్రీశైలం వైపు నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం వరకు జూరాలకు 2,25,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు ప్రస్తుతం 317.99 మీటర్ల నీటి నిల్వ ఉంది. జూరాల ప్రాజెకు ్ట పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు గానూ ప్రస్తుతం 8.591 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వఉంది. విద్యుదు త్పత్తికి 29,444 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,25,000 క్యూసెక్కుల వరద నీరు వ స్తుండగా 26 గేట్లు ఎత్తి దిగువకు 2,16,870 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే మొత్తం అవుట్ ఫ్లో 2,16,870 క్యూసెక్కులుగా నమోదైంది. అల్మట్టికి ఇన్ ఫ్లో 1,07,500 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 42,500 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. దిగువకు విడుదల చేసిన వరద నీరు నారాయణపూర్ కు వచ్చి చేరుతుండగా నారాయణపూర్ నుంచి జూరాలకు 62,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాంకు ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జూరాలకు రాత్రి వరకు మరింత వరద పెరిగే అవకాశం ఉంది. వరద ఉధృతి పెరిగితే రాత్రికి మరిన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
శ్రీశైలానికి కొనసాగుతున్న..
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా 1,81,766 క్యూసెక్కుల నీరు విడుదల కాగా, విద్యుదుత్పత్తి ద్వారా 30,599 క్యూసెక్కుల వరద నీరు విడుదల కాగా మొత్తం 2,12,365 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులకు గానూ ప్రస్తుతం 874.80 అడుగులు, పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 215 టీఎంసీలుకాగా ప్రస్తుతం 162.8190 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో 21,189 క్యూసెక్కులు. కుడిగట్టులో 9603 క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
తుంగభద్రకు ..
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శుక్రవారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 45,915 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,491 క్యూసెక్కులు నమోదైంది. కర్ణాటక, టీబీ డ్యాం గరిష్ఠస్థాయి నీటి మట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1622.76 అడుగుల నీటిమట్టం ఉన్నది. 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 69.410 టీఎంసీల నీటి నిల్వ ఉందని డ్యాం సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- Floods
- Jurala
- Jurala Floods
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

