అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకున్నది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన రైతు మహ్మద్ యాకూబ్ పాషా (40) తనకున్న మూడు ఎకరాల్లో వరి, పత్తి సాగు చేస్తున్నాడు.
- జనగామ జిల్లాలో విషాదం
స్టేషన్‌ఘన్‌పూర్, ఆగస్టు 7 : అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకున్నది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన రైతు మహ్మద్ యాకూబ్ పాషా (40) తనకున్న మూడు ఎకరాల్లో వరి, పత్తి సాగు చేస్తున్నాడు. ఇటీవల రెండు బోర్లు వేసినా నీరు పడలేదు. సాగుతోపాటు కుటుంబ పోషణ కోసం దాదాపు 6 లక్షల వరకు అప్పులయ్యాయి.
ఈ సారి సరైన వర్షాలు లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీరుతాయో తెలియక ఆందోళనకు గురయ్యాడు. గురువారం భార్య ఫర్జాన వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు పోగా, యాకూబ్ పాషా ఇంటి వద్ద గడ్డి మందు తాగాడు. వాంతులు చేసుకుంటుండగా చూసిన తల్లి చిన్నకుమారుడితో కలిసి చికిత్స నిమిత్తం 108లో ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వేణు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

