Sexual Assault | కర్ణాటక బీజేపీ నేత (Karnataka BJP leader) అరుణ్ కుమార్ పుతిల (Arun Kumar Puthila)పై లైంగిక వేధింపుల (Sexual Assault) కేసు నమోదైంది. 47 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2023 జూన్‌లో బెంగళూరు హోటల్లో అరుణ్ కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసి వాటి ద్వారా బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించారు. మహిళ ఫిర్యాదు మేరకు దక్షిణ కన్నడ జిల్లాలో అరుణ్ కుమార్‌పై లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్ (blackmail) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
SCR | భారీ వర్షాలు.. 86 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
CM Revanth Reddy | వరదల్లో జనం.. సచివాలయానికి రాని సీఎం
Brain Cancer | మెదడు క్యాన్సర్‌ను మొదట్లోనే కనిపెట్టగల సరికొత్త రక్త పరీక్ష