Brain Cancer | న్యూఢిల్లీ: గ్లియోబ్లాస్టోమా అనే ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌ను మొదట్లోనే కనిపెట్టగల కొత్త రక్త పరీక్షను పరిశోధకులు అభివృద్ధి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ నాట్రె డామ్ పరిశోధకులు రూపొందించిన ఈ పరికరం గంటలోనే ఫలితాన్ని వెలువరిస్తుంది. కేవలం 100 మైక్రో లీటర్ల రక్తం ఈ పరీక్షకు అవసరం.
‘మా సాంకేతికత నిర్దిష్టంగా గ్లియోబ్లాస్టోమా కోసం కాదు, ప్రారంభ దశలోనే దాన్ని కనిపెట్టే పరీక్షలు లేకపోవడంతో దానితోనే ప్రారంభించడం సమంజసం’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ చాంగ్ తెలిపారు. ఆటోమేటెడ్ పరికరంలో ఉండే ఒక చిన్న బయో చిప్ ఎలక్ట్రోకైనెటిక్ సెన్సర్‌ను ఉపయోగించి విద్యత్తు సాయంతో ఈ పరీక్షను నిర్వహిస్తుంది.