పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. బీహార్ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను ప్రశ్నించారు. బీహార్ గ్రామంలో ఒక రాత్రైనా గడపగలరా? అని రాహుల్‌కు సవాల్ విసిరారు. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్, బీహార్ ప్రజలకు చేరువయ్యేందుకు పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
కాగా, బీహార్ పట్ల రాహుల్ గాంధీకి ఉన్న నిబద్ధతను ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆయన బీహార్‌కు వస్తూ పోతూ ఉంటారని, కానీ ఎప్పుడూ యాత్ర చేపట్టలేదని విమర్శించారు. ‘బీహార్‌లోని ఒక గ్రామంలో ఎప్పుడైనా రాహుల్ గాంధీ ఒక రాత్రి గడిపినట్లయితే మాకు తెలియజేయండి. ఒక గ్రామంలో కేవలం ఒక రాత్రి గడపగలిగితే, ఆయన నిబద్ధతను మేం అంగీకరిస్తాం’ అని అన్నారు. ‘మీరు ఢిల్లీలో కూర్చొని బీహారీలను చూసి నవ్వుతారు. ఆ తర్వాత ఇక్కడకు వచ్చి మాకు ఉపన్యాసాలు ఇస్తారు’ అని మండిపడ్డారు.
Also Read:
Watch: హైకోర్టు లైవ్ స్ట్రీమ్ విచారణకు టాయిలెట్ నుంచి హాజరైన వ్యక్తి.. వీడియో వైరల్
Gold Stolen From Judge’s Bedroom | హైకోర్టు న్యాయమూర్తి బెడ్రూమ్ నుంచి.. బంగారం చోరీ
Woman Killed Buried | కోడలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మామ.. గోతిలో మృతదేహం పూడ్చివేత