Pune | మహారాష్ట్ర పూణె (Pune)లో పట్టపగలే దొంగలు (armed robbers) రెచ్చిపోయారు. బంగారం దుకాణాన్ని దోచుకున్నారు (looted jewellery). కేవలం రెండు నిమిషాల్లో రూ.కోటి విలువైన ఆభరణాలను దోచుకుని ఉడాయించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ దోపిడీ జరిగింది. పాన్‌షెట్ రోడ్డులోని వైష్ణవి జ్యువెలర్స్ అనే దుకాణం వద్దకు ఐదుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చారు. ఆ సమయంలో దుకాణంలో యజమాని శ్రీ బాబర్, అతడి కుమారుడు, ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉన్నారు. దుకాణంలోకి చొరబడ్డ సాయుధ ముఠా దుకాణంలోని వారిని బెదిరించారు. ఆ తర్వాత గాజు క్యాబినెట్లో ఉన్న దాదాపు 75 నుంచి 80 తులాల బంగారు ఆభరణాలను కేవలం ఒకటిన్నర నుంచి రెండు నిమిషాల్లో తమ వెంట తెచ్చుకున్న సంచుల్లోకి నింపుకుని అక్కడి నుంచి ఉడాయించారు. దోపిడీకి గురైన బంగారం విలువ రూ.కోటికిపైనే ఉంటుందని అంచనా.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దోపిడీకి సంబంధించిన దృష్యాలు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టపగలే దొంగతనం జరగడంతో మిగతా వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
पुणे : हथियारबंद लुटेरों ने दिनदहाड़े ज्वेलरी शॉप लूटी#Pune pic.twitter.com/uVyGwBWTmG
— NDTV India (@ndtvindia) December 27, 2025
Also Read..
Wild Boar Attack: ఫారెస్ట్ ఆఫీసర్‌పై దాడి చేసిన అడవిపంది.. ఇక ఏం జరిగిందో చూడండి.. వీడియో
Delhi | న్యూ ఇయర్ ముందు ఢిల్లీలో భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్ట్
Bihar | గ్యాస్ స్టవ్ చుట్టూ ఏడడుగులు.. వైరల్‌గా మారిన ఇద్దరమ్మాయిల పెళ్లి