Delhi | న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ అఘాత్ పేరిట శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించి 285 మందిని అరెస్టు చేశారు.
ఆగ్నేయ ఢిల్లీలోని నేర ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి పలు బృందాలు ఒకేసారి సోదాలు చేపట్టాయి. ఈ డ్రైవ్లో భాగంగా దాదాపు వెయ్యికి పైగా అనుమానితులను విచారణకు తీసుకొచ్చారు. వారిలో 285 మందిని వివిధ కేసుల్లో అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సోదాల్లో అక్రమ తుపాకులు సహా 40కి పైగా ఆయుధాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. అలాగే మత్తుపదార్థాలు, అక్రమ మద్యం కూడా పట్టుబడిందని చెప్పారు. పలుచోట్ల నిర్వహించిన తనిఖీల్లో లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
న్యూ ఇయర్ వేడుకల సమయంలో నేరాలు పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టామని ఉన్నతాధికారులు తెలిపారు. స్థానిక గూఢచార సమాచారం, నిఘా ఆధారంగా పక్కా ప్రణాళికతో తమ బృందాలు పనిచేశాయని పేర్కొన్నారు.
Operation Aaghat 3.0 | Key Outcomes from the South-East District-
285 accused arrested under the Excise Act, NDPS Act & Gambling Act. 504 persons apprehended under preventive action. 116 Bad Characters (BCs) apprehended. 10 property offenders and five auto-lifters arrested.… pic.twitter.com/XVTHulCBPC— ANI (@ANI) December 27, 2025