హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : వచ్చే బడ్జెట్లో ఆర్టీసీకి రూ.10వేల కోట్లు కేటాయించాలని, మహాలక్ష్మి డబ్బులు, రాయితీలు తక్ష ణం చెల్లించి కార్మికులను ఆదుకోవాల ని, 2021, 2025 వేతన ఒప్పందాలు అమలు చేయాలని తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చే సింది. ఎలక్ట్రిక్ బస్‌ల విధానంలో మా ర్పులు చేసి ఆర్టీసీకి అవకాశం ఇవ్వాలని, రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరింది. ఆర్టీసీలో యూనియన్లపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి, తక్షణ మే గుర్తింపు ఎన్నికలు జరపాలనే డిమాండ్లతో మార్చి 23న హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో ఒక్కరోజు ‘మహాదీక్ష’ చేపట్టాలని నిర్ణయించినట్టు సం ఘం నేతలు తెలిపారు. యూనియన్ అధ్యక్షుడు వీరాంజనేయులు అధ్యక్షతన 23న జరిగిన రాష్ట్ర కమిటీలో, 26 న జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్‌లో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రతి డిపో నుంచి 5 మందికి తగ్గకుండా హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు ప్రవేశ పెట్టిన కర్తవ్యాలను ఆఫీస్ బేరర్స్ ఏకగ్రీవంగా ఆమోదించారు.