ముంబై: ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున కొండచరియలు(Landslides) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో 8 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో భారీ వర్షం నమోదు అయినట్లు అధికారులు చెప్పారు. ఘాట్కోపర్కు సమీపంలో ఉన్న కుర్లా ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు వెల్లడించారు. చిరాగ్నగర్లో ఉదయం 3.48 నిమిషాలకు గౌషియా చావల్ వద్ద ఈ ఘటన జరిగినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడినట్లు డీసీపీ గణేశ్ షిండే చెప్పారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశామన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్లు చెప్పారు. పోలీసులను మోహరించారు. బీఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర ఏజెన్సీలకు చెందిన సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. సోహెల్ అన్సారీ, మొహమ్మద్ అన్సారీ అనే ఇద్దరు గాయపడ్డారు. ముంబై మేయర్ రీతూ తవడే, అదనపు మున్సిపల్ కమీషనర్ అవినాశ్ దాకనే.. ఘటనా స్థలాన్ని విజిట్ చేశారు.
GHATKOPAR | Landslide NDRF-BMC Ka Rescue Operation Jari Gausiya Chawl , Chirag Nagar, Near Rathod medical
Update Information
➡ Incident: Land slide Level- II
➡ Incident reported by: BMC’s MFB
➡ Date & time of incident reported: 12 .08. 2026 @ 0348 hrs
➡Time of update… pic.twitter.com/MxYgcfZXrN
— MUMBAI TV (@tv_mumbai) August 12, 2026