హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గుగులోత్ రవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్లో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎఫ్ఏసీ కార్యదర్శి కంభంపాటి శారద నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.