బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ (Mallika Sherawat) తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్న పాపులర్ రియాలిటీ షో ‘ది ట్రైటర్స్ సీజన్ 2’ (The Traitors Season 2) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 13 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో, షోకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోమోలు, విశేషాలు బయటికి వస్తున్నాయి. ఈ షోలో పాల్గొన్న మల్లికా షెరావత్.. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌తో తనకున్న పరిచయం గురించి సంచలన విషయాలు వెల్లడించారు.
షోలో భాగంగా తోటి కంటెస్టెంట్ మల్లికా షెరావత్‌ను ఉద్దేశించి, ‘మీకు ఎప్పుడైనా ఎవరి మీదైనా క్రష్ ఉందా? లేక అందరికీ మీపైనే క్రష్ ఉందా?’ అని ప్రశ్నించారు. దీనికి మల్లికా బదులిస్తూ, ‘అందరికీ నాపైనే క్రష్ ఉంది. ఇటీవల కాలంలో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ కూడా నాపై మనసు పారేసుకున్నారు. నేను అబద్ధం చెప్పడం లేదు. నా దగ్గర ఫోన్ ఉంటే ఆయన పంపిన వీడియోలను కూడా చూపించేదాన్ని’ అంటూ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన ఎలాంటి వీడియోలు పంపుతారని తోటి కంటెస్టెంట్లు ప్రశ్నించగా.. తామిద్దరం కలిసి పార్టీలలో పాల్గొన్న క్షణాలకు సంబంధించిన వీడియోలని తెలిపింది. ఇక టామ్ క్రూజ్ వ్యక్తిత్వం చాలా అద్భుతంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కాగా, మల్లికా షెరావత్ చేసిన ఈ వ్యాఖ్యలపై టామ్ క్రూజ్ గానీ, ఆయన ప్రతినిధులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు ఇవి పూర్తిగా మల్లికా షెరావత్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలుగానే మిగిలిపోయాయి.
‘ది ట్రైటర్స్ సీజన్ 2’ విశేషాలు
వ్యూహాలు, మోసాలు, ఎత్తుగడల ఆధారంగా సాగే ప్రసిద్ధ రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’. ఇందులో కంటెస్టెంట్లను రహస్యంగా నమ్మకస్తులు, ద్రోహులు అని రెండు రకాలుగా విభజిస్తారు. నమ్మకస్తులు ద్రోహులను గుర్తించి ఏరివేయాలని ప్రయత్నిస్తే, ద్రోహులు తమ గుర్తింపును బయటపెట్టకుండా ఇతరులను ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ సీజన్లో మల్లికా షెరావత్‌తో పాటు మునవర్ ఫరూఖీ, శ్వేతా తివారీ, రణవీర్ బ్రార్, రియా చక్రవర్తి, క్రిస్టల్ డిసౌజా, దలీప్ తాహిల్, పరుల్ గులాటి, షహ్నీల్ గిల్, హర్మన్ సింఘా, ఇక్కా, సాహిల్ సలాథియా, అభిషేక్ మల్హన్ తదితరులు పోటీలో పాల్గొంటున్నారు.
Wow 😲 #MallikaSherawat getting Dm’s of #TomCruise. That was little bit unexpected, but again with Mallika nothing unexpected.
She’s saying tom is fabulous, even peacock agrees in the background 😅#TheTraitorsOnPrime #TheTraitors2 pic.twitter.com/KKWqnLHEHu
— Max (@Mad_Max69ton) August 11, 2026