బదౌన్: ఓ వరాహం తన ప్రతాపాన్ని(Wild Boar Attack) చూపించింది. యూపీలో ఫారెస్ట్ ఆఫీసర్‌ను పట్టి పీడించింది. బదౌన్ జిల్లాలో జరిగిన ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతున్నది. అడవి పంది చేసిన దాడిలో స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బదౌన్‌లోని సిర్సౌలీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అడవి పంది పంటల్ని నాశనం చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో.. దాన్ని పట్టుకునేందుకు అక్కడికి అటవీశాఖ సిబ్బంది వెళ్లింది. అయితే వల ఆధారంగా ఆ అడవిపందిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో ఆ వైల్డ్బూర్ తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. వలను చేధించింది ఫారెస్ట్ ఆఫీసర్ శుభం ప్రతాప్ సింగ్‌ను తన నోటితో పట్టేసుకున్నది. అతన్ని కింద పడేసి కొరికేసింది. అయితే మిగితా సిబ్బంది తమ వద్ద ఉన్న కర్రలతో ఆ పందిని తరిమే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఫారెస్ట్ ఆఫీసర్‌ను అది వదలలేదు. ఇద్దరు సిబ్బంది కర్రలతో ఎన్ని దెబ్బలు కొట్టినా అది గట్టిగా ఆ ఆఫీసర్‌ను పట్టుకున్నది. ఆఫీసర్ శుభంను కిందమీదపడేసింది.
ఓ అయిదు నిమిషాల తర్వాత అతన్ని వదిలేసింది. ఆ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నది. గాయపడ్డ సింగ్‌ను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు.
Wild Boar Rampage 🚨
Following complaints of crop damage, Subham Pratap Singh and his team arrive for a rescue operation .While attempting to entrap the boar, it suddenly charged and pinned down the officer. Other personnel present somehow manage to rescue the officer #Animal… pic.twitter.com/tbFchOyPxr
— D (@Deb_livnletliv) December 26, 2025