Indian Railways | భారతీయ రైల్వేలో (Indian Railways) ప్రయాణికుల సమస్యలు ఇటీవలే కాలంలో సర్వసాధారణమైపోయాయి. రైళ్లలో అందించే ఫుడ్ నాణ్యతకు మొదలు, టాయిలెట్స్‌లో నీళ్ల కొరత వరకూ ఏటా పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు (complaints) అందుతుంటాయి. అయితే, రైళ్లలోని టాయిలెట్స్ (Train Toilets), వాష్ బేసిన్ (wash basins)లలో నీళ్లు రావట్లేదని 2022-23లో ఏకంగా లక్షకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక వెల్లడించింది. అందులో దాదాపు 34 శాతం కేసులు పరిష్కరించినట్లు పేర్కొంది.
సుదూరం ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రతకు సంబంధించి 2018-19 నుంచి 2022-23 వరకు భారతీయ రైల్వే పనితీరుపై కాగ్ నివేదిక రూపొందించింది. ఇందులో 2022-23 ఏడాదిలోనే రైళ్లలోని టాయిలెట్లు, వాష్ బేసిన్లలో నీళ్లు లేవట్లేదంటూ దాదాపు 1,00,280 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. అందులో 33,937 కేసులను సకాలంలో పరిష్కరించినట్లు తెలిపింది. నిర్దేశిత స్టేషన్లలో నీరు నింపడంలో వైఫల్యం కారణంగానే ఈ సమస్య తలెత్తుతున్నట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన నివేదికను కాగ్ పార్లమెంట్‌కు బుధవారం అందించింది.
Also Read..
Naveen Patnaik | ఆస్పత్రి నుంచి నవీన్ పట్నాయక్ డిశ్చార్జ్.. కృతజ్ఞతలు తెలిపిన బీజేడీ చీఫ్
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు
Vaishno Devi Pilgrims | లోయలో పడ్డ బస్సు.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు