Bus Falls Into Gorge | లోయలో పడిన బస్సు.. ఇద్దరు మహిళలు మృతి, 31 మందికి గాయాలు
Bus Falls Into Gorge | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జైపూర్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Bus Falls Into Gorge) రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం 33 మంది ప్రయాణికులు ఒక బస్సులో అజ్మీర్ నుంచి పుష్కర్ వెళ్తున్నారు. పుష్కర్ ఘాటి ప్రాంతంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. చెట్లు, పొదల్లో అది చిక్కుకున్నది.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. బట్టలతో తయారు చేసిన తాత్కాలిక తాడుతో ప్రయాణికులను రక్షించారు.
మరోవైపు ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. మృతులను 28 ఏళ్ల పూజ, 50 ఏళ్ల విమలా దేవిగా గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. గాయపడిన 31 మందిని తొలుత పుష్కర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత అజ్మీర్‌లోని జవహర్లాల్ నెహ్రూ (జేఎల్ఎన్) ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదం కారణంగా పుష్కర్ ఘాటి ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Also Read:
Watch: రీల్ కోసం బైక్‌పై ముగ్గురు సోదరుల విన్యాసాలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Americans detained | లగేజ్‌లో శాటిలైట్ ఫోన్లు.. అదుపులో ఇద్దరు అమెరికన్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

