Vijay Kumar Sinha | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు తొలి విడత పోలింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (Bihar Deputy Chief Minister) విజయ్ కుమార్ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం లఖిసరైలో ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది.
ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లను ఉపముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిపై విజయ్ కుమార్ సిన్హా (Vijay Kumar Sinha) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్జేడీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు మేము వారి ఛాతీపై బుల్డోజర్ల (Bulldozer)తో తొక్కిస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు తమ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల వద్ద బెదిరిస్తున్నారని, బయటకు తోసేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ప్రజలను ఓటేయకుండా అడ్డుకుంటున్నారన్నారు.
అయితే, పరిస్థితి అదుపులోనే ఉందని, జిల్లాలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని పోలీసులు తెలిపారు. పోలింగ్ బూత్‌ల వద్ద బీజేపీ ఏజెంట్లను బెదిరించారంటూ వస్తున్న ఆరోపణలను జిల్లా పోలీసు చీఫ్ అజయ్ కుమార్ తోసిపుచ్చారు. అలాంటిది ఏమీ లేదన్నారు. అలా జరిగి ఉంటే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Also Read..
Bus Accident | స్లీపర్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు