Ayodhya Ram Mandir | అయోధ్యలోని భవ్య రామ మందిరం ప్రత్యేకతలు..
Ayodhya Ram Mandir | యావత్తు భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రత్యేకతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Ayodhya Ram Mandir | యావత్తు భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలకు ఓ వైపు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను 22వ తేదీ మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆలయ నిర్మాణం, విశేషాలపై ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రత్యేకతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆలయ ప్రత్యేకతలు..
- భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం అయోధ్య రామ మందిరం.
- ఈ రామ మందిరం సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించారు (traditional Nagara style).
- 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఈ మందిరాన్ని నిర్మించారు.
- మందిరం మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది.
- ఈ ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి.
- ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడి ఐదేళ్ల బాలరాముడిగా (శ్రీరామ్ లల్లా విగ్రహం) కొలువు దీరనున్నాడు. మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది.
- ఈ ఆలయంలో మొత్తం ఐదు మండపాలు ఉంటాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపాలు ఉంటాయి.
- రామాలయంలోని మొత్తం గోడలు, స్తంభాల మీద అనేక రకాల దేవతమూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను చిత్రించారు.
- రామాలయంలోకి తూర్పు దిశ నుంచి ప్రవేశం ఉంటుంది.
- ఇక్కడి సింగ్ ద్వార్ గుండా 32 మెట్లు ఎక్కి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.
- దేవాలయానికి వచ్చే వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ఆలయంలో ర్యాంప్‌లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు.
- ఆలయం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దీర్ఘచతురస్కాకారంలో గోడ నిర్మించారు.
- నాలుగు మూలల్లో నాలుగు దేవాలయాలు నిర్మించారు. వీటిల్లో సూర్యభగవానుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తర భుజంలో మా అన్నపూర్ణ దేవాలయం, దక్షిణం వైపు హనుమంతుని మందిరాలు ఉన్నాయి.
- మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతాకూపం) ఉంది.
- శ్రీ రామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్‌లో మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద్ రాజ్, శబరీమాత, అహల్య దేవిల మందిరాలున్నాయి.
- కాంప్లెక్స్ నైరుతి భాగంలో కుబేర్ తిలపై ఉన్న పురాతన శివాలయాన్ని పునరుద్దరించారు. జటాయువును ప్రతిమతో పునర్నిర్మించారు.
- ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మించారు.
- మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు.. ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీటును వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు.
- మందిర్ పునాది 14-మీటర్ల మందపాటి రోలర్-కాంపాక్ట్ కాంక్రీట్ (RCC)తో నిర్మించారు. ఈ కాంక్రీట్ కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది.
- భూమిలోని తేమతో ఆలయానికి భవిష్యత్తులో నష్టం వాటిల్లకుండా ఉండేందుకు 21 అడుగుల ఎత్తులో గ్రానైట్‌తో పునాది నిర్మించారు.
- ఆలయానికి సమీపంలోని కరసేవక్‌పురంలో 30 ఏండ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు. గత 30 ఏండ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు.
- బాహ్య వనరులపై ఆధారపడకుండా ఉండేందుకు.. ఆలయం కాంప్లెక్స్‌లో మురుగునీటి శుద్ధ కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్నిమాపకాల నుంచి భద్రత కోసం నీటి సరఫరా, స్వతంత్ర విద్యుత్ కేంద్రాలను నిర్మించారు.
- 25,000 మంది పట్టే సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం నిర్మించబడుతోంది. ఇది యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాన్ని అందిస్తుంది.
- కాంప్లెక్స్‌లో స్నానపు గదులు, వాష్‌రూమ్‌లు, వాష్ బేసిన్లు, ఓపెన్ ట్యాప్‌లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ కూడా ఉంటుంది.
- మందిర్ పూర్తిగా భారత సాంప్రదాయ, స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడుతోంది. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చగా ఉండేలా పర్యావరణ-నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దీనిని నిర్మిస్తున్నారు.
- శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది.
- ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ ఆలయంగా నిలవనుంది. ప్రస్తుతం అంకోర్‌వాట్‌లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉన్నది. తర్వాతి స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం ఆక్రమించింది.
- ప్రధాన ఆలయాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మించగా, ఉపాలయాలు, ఇతరత్రా నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది.
- రిక్టర్ స్కేల్‌పై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా, మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం 2,500 ఏండ్లపాటు ఆలయం వాటిని తట్టుకొనేలా డిజైన్ చేశారు.
- ఆయోధ్య ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు.
- వసుధైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించేలా.. ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని, 2,587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు.
- ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్‌పై సూర్య కిరణాలు పడినట్లుగానే, రామమందిరంలోని బాల రాముడి విగ్రహంమీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.
- ఇక ఆలయ నిర్మాణానికి రూ.1,400 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా.
- ఈ ఆలయానికి 05-08-2020లో శంకుస్థాపన చేశారు.
- మందిరం నిర్మాణం 2026కి సంపూర్ణమవుతుందని అంచనా.
Also Read..
Jitendra Awhad | శ్రీరాముడు మాంసాహారి.. ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
Arvind Kejriwal | విచారణ పేరుతో అరెస్ట్ చేసేందుకు కుట్ర.. ఈడీ సమన్లపై కేజ్రీవాల్
Bomb Threats | రామ మందిరంతో సహా పేల్చేస్తామంటూ యూపీ సీఎంకు బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

