Arvind Kejriwal | విచారణ పేరుతో అరెస్ట్ చేసేందుకు కుట్ర.. ఈడీ సమన్లపై కేజ్రీవాల్
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇచ్చిన సమన్లపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా స్పందించారు. ఈడీ ఇచ్చిన నోటీసులు లీగల్‌గా చెల్లవని తేల్చి చెప్పారు.
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇచ్చిన సమన్లపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా స్పందించారు. ఈడీ ఇచ్చిన నోటీసులు లీగల్‌గా చెల్లవని తేల్చి చెప్పారు. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచారం చేయకుండా తనను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈడీ పంపిన సమన్లను ఆయన తీవ్రంగా ఖండించారు.
‘నేను ఏ తప్పూ చేయలేదు. కేవలం నన్ను అడ్డుకోడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఇది. మద్యం పాలసీలో అవినీతి జరగలేదన్నది నిజం. కానీ బీజేపీ మాత్రం ఏదో జరిగిపోయిందని చెప్పి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తోంది. నా నిజాయితీయే నాకున్న ఆస్తి. దాన్ని వారు దెబ్బతీయాలని చూస్తున్నారు. ఈడీ పంపిన సమన్లు చెల్లవని ఇప్పటికే మా లాయర్లు చెప్పారు. బీజేపీ లక్ష్యం నన్ను విచారించడం కాదు.. లోక్‌సభ ఎన్నికల ముందు ప్రచారం చేయకుండా కట్టడి చేసేందుకే ఇదంతా. విచారణ సాకుతో నన్ను పిలిచి అరెస్ట్ చేయాలనుకుంటున్నారు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.
#WATCH | On ED summons in liquor police case, Delhi CM & AAP leader Arvind Kejriwal says, “The truth is that there was no corruption. BJP wants to arrest me. My biggest asset is my honesty & they want to dent it. My lawyers have told me that summons sent to me are illegal. BJP’s… pic.twitter.com/jLWmkZ2mxj
— ANI (@ANI) January 4, 2024
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ ముందు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి నిరాకరించారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ రెండుసార్లు జారీ చేసిన నోటీసులను ఆయన లెక్క చేయలేదు. ఈ క్రమంలోనే ఈడీ మూడోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం.. బుధవారం కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ముచ్చటగా మూడోసారి కూడా ఆ విచారణకు ఆప్ అధినేత గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఈడీ సంస్థకు లేఖ రాశారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తలమునకలై ఉన్నానని, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని, ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గాని తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు నేడు అరెస్ట్ చేయనున్నారంటూ ఉదయం నుంచి ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని ఈడీ కొట్టిపారేసింది.
Also Read..
KCR | కేసీఆర్‌ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్
Amala Paul | తల్లికాబోతున్న అమలాపాల్.. బేబీబంప్ ఫొటోలు షేర్ చేసిన నటి
Coronavirus | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో 760 కొత్త కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

