Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 760 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ (Health Ministry) శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది.
ఇక నిన్న ఒక్కరోజే 775 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,78,047) చేరింది. నిన్న ఒక్కరోజే రెండు మరణాలు నమోదయ్యారు. కేరళలో ఒకరు, కర్ణాటకలో ఒకరు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య 5,33,373కి ఎగబాకింది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు భారత్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు 511కి పెరిగాయి. మొత్తం 11 రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే అత్యధికంగా 199 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కేరళలో 148 కేసులు, గోవాలో 47, గుజరాత్లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్లో నాలుగు, తెలంగాణలో రెండు, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.
Also Read..
Bomb Threats | రామ మందిరంతో సహా పేల్చేస్తామంటూ యూపీ సీఎంకు బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్
Houthis | ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు.. హౌతీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా సహా 12 దేశాలు
Ira Khan | వివాహబంధంలోకి అమీర్ ఖాన్ కూతురు.. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను మనువాడిన నుపుర్