Ira Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) కూతురు ఐరా ఖాన్ (Ira Khan) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే (Nupur Shikhare)ను ఐరా వివాహం చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఐరా, నుపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ముంబైలోని ఓ హోటల్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. వివాహం అనంతరం అదే హోటల్లో రిసెప్షన్ జరిగింది.
అయితే, ఈ వివాహం చాలా బిన్నంగా జరిగింది. సాధారణంగా వరుడు గుర్రం లేదా, కారుపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకుంటూ ఉంటారు. అయితే నుపుర్ మాత్రం దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ వివాహ వేడుక వద్దకు చేరుకున్నాడు. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను మనువాడాడు. ఇక ఈనెల 8వ తేదీన ఈ జంట మరోసారి వివాహ వేడుక జరుపుకోనుంది. ఆ తర్వాత జనవరి 13వ తేదీన ముంబైలో గ్రాండ్‌గా వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు.
Aamir Khan daughter Ira Khan And Nupur Shikare taking vows- Is this Christian or Muslim Wedding?? #NupurShikhare #AamirKhan #IraKhan pic.twitter.com/xIKKToQdwE
— Rosy (@rose_k01) January 4, 2024
ఇక ఈ వివాహ వేడుకకు అమీర్ ఖాన్, తన మాజీ భార్యలు రీనా దత్త, కిరణ్ రావు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్-నీతా అంబానీ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఐరా-నుపుర్ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
bro went straight to his wedding after jogging 😭#NupurShikhare #IraKhan #AamirKhan pic.twitter.com/Uy8rwCblI5
— a.🍉 (@sojaera) January 3, 2024
Perfect family moment! #AamirKhan along with both his ex-wives- #ReenaDutta(bride’s mother & #KiranRao and sons- Junaid & Azad pose with newlyweds #IraKhan & #NupurShikhare pic.twitter.com/ox4BTjwytd
— Aashu Mishra (@Aashu9) January 3, 2024
Aamir Khan’s would be son-in-law #NupurShikhare sits on the dhol 🥁#AamirKhan #IraKhan pic.twitter.com/k1OMFNczog
— BollyHungama (@Bollyhungama) January 3, 2024
बॉलीवुड अभिनेता आमिर खान की बेटी इरा खान ने अपने ब्वॉयफ्रेंड नूपुर शिखरे से शादी की।#IraKhan #NupurShikhare #AamirKhan pic.twitter.com/K9DKfuE0yt
— Sachin Kumar Vishwakarma (@apnasachinkumar) January 3, 2024
#NupurShikhare jogs his way to wedding venue and joins his Baaraat pic.twitter.com/g6B4ZVszkP
— Scroll And Play (@scrollandplay) January 3, 2024
Also Read..
INDvsSA 2nd Test: కేప్‌టౌన్‌లో బౌలర్ల కేక.. రికార్డులే రికార్డులు..
Arvind Kejriwal | అవన్నీ వదంతులే.. కేజ్రీవాల్ అరెస్ట్ ప్రచారాన్ని కొట్టిపారేసిన ఈడీ.. !
YS Sharmila | 10.30కు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న షర్మిల.. వైఎస్సార్టీపీ విలీనం