Arvind Kejriwal | అవన్నీ వదంతులే.. కేజ్రీవాల్ అరెస్ట్ ప్రచారాన్ని కొట్టిపారేసిన ఈడీ.. !
ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను (Arvind Kejriwal) అరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కొట్టిపారేసింది. అవన్నీ వట్టి వదంతులేనని (Rumours) ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి.
న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను (Arvind Kejriwal) అరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కొట్టిపారేసింది. అవన్నీ వట్టి వదంతులేనని (Rumours) ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి. కేజ్రీవాల్ ఇంటిపై దాడులు చేయాలని, సోదాలు నిర్వహించాలన్న ప్లాన్ ఏమీ లేదని వెల్లడించాయి. కాగా, గురువారం ఉదయం కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడులు చేయనుందని, అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంటారని మంత్రులు అతిశి, సౌరభ్ భరద్వాజ్తోపాటు ఆప్ నేతలు ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈడీ వర్గాల నుంచి తమకు సమాచారం ఉందని బుధవారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు.
‘అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గురువారం ఉదయం ఈడీ దాడి చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి’ అంటూ బుధవారం రాత్రి 11.50 గంటలకు మంత్రి అతిశి ట్వీట్ చేశారు. రెండు నిమిషాల తర్వాత మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇదే విషయాన్ని హిందీలో పోస్ట్ చేశారు. ఈడీ గురువారం ఉదయం కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటుందని, ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయితే ఇదంతా వట్టిదేనని ఈడీ వర్గాలు వెళ్లడించాయి. విచారణకు రాలేనంటూ కేజ్రీవాల్ రాసిన లేఖను పరిశీలిస్తున్నామని తెలిపాయి.
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ మూడోసారి సమన్లు జారీచేసింది. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తలమునకలై ఉన్నానని, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున విచారణకు రాలేనని, ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గాని తాను సిద్ధంగా ఉన్నానని లేఖ రాశారు.
అసలు తనను విచారణకు పిలవడానికి నిజమైన కారణం, పరిధి, స్వభావం, ఉద్దేశం తెలియజేయాలంటూ గతంలో రాసిన లేఖలపై దర్యాప్తు సంస్థ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఈడీ మౌనం చూస్తుంటే ఏదో అవాంఛనీయ రహస్యాన్ని దాయడమే కాక, అపారదర్శకంగా, పక్షపాతంతో ఉన్నట్టు అనుమానాలు కలిగిస్తున్నాయని అందులో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- arrest
- Arvind Kejriwal
- Course
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

