Amala Paul | కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అభిమానులకు శుభవార్త చెప్పింది ప్రముఖ నటి అమలా పాల్ (Amala Paul). తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది (Announce Pregnancy). ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. బీచ్‌లో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేసిన నటి.. ‘ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం’ అంటూ ప్రకటించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు అమలా పాల్‌కు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
మాలీవుడ్ నుంచి వచ్చి.. తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అమలాపాల్ (Amala Paul). పాపులర్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ను 2014లో పెళ్లి చేసుకున్న నటి.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో 2017తో విజయ్ నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లపాటు ఒంటరిగానే ఉంది. ఈ క్రమంలో గతేడాది రెండో వివాహం చేసుకుంది. లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్, టూరిజం, హాస్పిటాలిటీ ప్రొఫెషనల్ జగత్ దేశాయ్ (Jagat Desai)తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది నవంబర్ మొదటివారంలో కోచిలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది.
Also Read..
Ira Khan | వివాహబంధంలోకి అమీర్ ఖాన్ కూతురు.. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను మనువాడిన నుపుర్
Coronavirus | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో 760 కొత్త కేసులు
Bomb Threats | రామ మందిరంతో సహా పేల్చేస్తామంటూ యూపీ సీఎంకు బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్