పాట్నా: చలికాలం నేపథ్యంలో గదిలో వెచ్చదనం కోసం మంట రాజేసి ఒక కుటుంబం నిద్రించింది. విష వాయువులు వెలువడంతో ఒక వృద్ధురాలు, ముగ్గురు పిల్లలు మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. (4 dead due to brazier) బీహార్‌లోని చాప్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చాప్రాకు చెందిన ఒక కుటుంబం గురువారం రాత్రి వేళ గదిలో వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటి వెలిగించారు. తలుపులు, కిటికీలు మూసేశారు. ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఆ గదిలో నిద్రించారు.
కాగా, బొగ్గుల కుంపటి మండటంతో ఆ గదిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి. విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ పేరుకుపోయింది. దీంతో ఆ గదిలో నిద్రించిన ఎనిమిది మంది స్పృహ కోల్పోయారు. శుక్రవారం తెల్లవారుజామున కింది అంతస్తులో నివసించే బంధువులు పైకి వెళ్లి చూశారు. ఆ గదిలో ఉన్న వారి పరిస్థితి చూసి ఆందోళన చెందారు.
మరోవైపు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మూడేళ్ల తేజాంష్ కుమార్, ఏడు నెలల గుడియా కుమారి, ఆదియా కుమారి, 70 ఏళ్ల కమలావతి దేవి అప్పటికే మరణినంచినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 25 ఏళ్ల ఆర్య కుమారి, 24 ఏళ్ల ఆర్య సింగ్, 25 ఏళ్ల అనిషా, 35 ఏళ్ల అమిత్ అలియాస్ సోనుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Critical in Hospital
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత బొగ్గుల కుంపటి ఉంచిన గదిని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందాన్ని పంపి ఆధారాలు సేకరించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు శీతాకాలంలో మూసి ఉన్న బెడ్ రూముల్లో బ్రజియర్లు, హీటర్లు, బ్లోయర్లను ఉపయోగించవద్దని ఆ జిల్లా అధికారులు సూచించారు. నిద్రించే గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని కోరారు. తద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.
Also Read:
Tej Pratap Yadav | ‘బహిష్కృత నేత నుంచి హత్య బెదిరింపులు’.. తేజ్ ప్రతాప్ యాదవ్ ఫిర్యాదు
Karnataka demolitions | కర్ణాటకలో 200కు పైగా ఇళ్లు కూల్చివేత.. నిరాశ్రయులైన 400 ముస్లిం కుటుంబాలు
Ropeway Collapses | బీహార్‌లో కొత్తగా నిర్మించిన రోప్‌వే.. ట్రయల్ రన్లో కూలింది