పాట్నా: బీహార్‌కు చెందిన జనశక్తి జనతాదళ్ (జేజేడీ) చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ బహిష్కరించిన నేత నుంచి తనకు హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. తనకు భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీతో పాటు కుటుంబం నుంచి వెలివేశారు. ఈ నేపథ్యంలో జేజేడీ పార్టీ ఏర్పాటు చేసిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో మహువా స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
కాగా, జేజేడీ జాతీయ ప్రతినిధిగా రేణును నియమించినట్లు తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. అయితే పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నట్లు విమర్శించారు. ఉద్యోగాలు, ఇతర హామీలతో పార్టీ కార్యకర్తలు, ఇతరుల నుంచి ఆయన డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించారు.
మరోవైపు ఈ ఆరోపణల నేపథ్యంలో డిసెంబర్ 14న రేణును పార్టీ నుంచి బహిష్కరించినట్లు తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో తనను దుర్భాషలాడడంతోపాటు చంపుతానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే తనకు భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని తేజ్ ప్రతాప్ కోరారు. డిప్యూటీ సీఎం, హోంమంత్రి సామ్రాట్ చౌదరికి లేఖ రాశారు. దీనిని ఆయన ధృవీకరించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Karnataka demolitions | కర్ణాటకలో 200కు పైగా ఇళ్లు కూల్చివేత.. నిరాశ్రయులైన 400 ముస్లిం కుటుంబాలు
Ropeway Collapses | బీహార్‌లో కొత్తగా నిర్మించిన రోప్‌వే.. ట్రయల్ రన్లో కూలింది