Swimming Pool | రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఉత్తరభారతంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇంకా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న ఓ యూట్యూబర్ కారులోనే మినీ స్విమ్మింగ్ పూల్ (Swimming Pool)ను ఏర్పాటు చేసి చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన కొందరు ఏకంగా ట్రాక్టర్ ట్రాలీ (tractor trolley)ని మినీ స్విమ్మింగ్ పూల్‌గా మార్చేశారు.
అమ్రోహా (Amroha) కి చెందిన కొందరు వ్యక్తులు ట్రాక్టర్ ట్రాలీని స్విమ్మింగ్ పూల్లా మార్చేశారు. నీరు లీక్ అవ్వకుండా ట్రాలీని మొత్తం ఓ మందపాటి పట్టతో కవర్ చేశారు. అందులో నీళ్లు నింపి చిన్నారులు, కొందరు యువత స్విమ్మింగ్ చేస్తూ కనిపించారు. నీటిలో మునుగుతూ ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
#Breking #Amroha भीषण गर्मी से बचने के लिए तरह-तरह के अपना रहे तरीके,
ट्रैक्टर ट्राली को बनाया स्विमिंग पूल,
हाइवे पर ट्रैक्टर ट्रॉली मे बच्चों का नहाते वीडियो वायरल,
भीषण गर्मी में पानी का आनंद ले रहे बच्चे,
गजरौला थाना क्षेत्र की बिजनौर रोड का बताया जा रहा है वीडियो pic.twitter.com/bRwTzjnOyd
— Journalist Chandra prakash (@Chandra16596690) June 16, 2024
Also Read..
Vignesh Shivan | తన ఇద్దరు పిల్లలతో.. బాహుబలి సీన్‌ను రీక్రియేట్ చేసిన విఘ్నేశ్ శివన్
train collision | బెంగాల్ రైలు ప్రమాద మృతులకు రూ.10 లక్షల నష్టపరిహారం