Karnataka Bus | కర్ణాటక బస్‌స్టాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హావేరీలోని సెంట్రల్ బస్ స్టాండ్‌లో ఉన్న ఓ ప్లాట్‌ఫాం వద్ద ప్రయాణికులు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో ఓ బస్సు ప్లాట్‌ఫాం వైపు వేగంగా దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన బస్సు కంట్రోల్ కాకుండా ఒక్కసారిగా ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారి మృతి చెందడంతో కుటంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
Sensitive Content
సీసీటీవీ ఫుటేజ్
కర్ణాటక హావేరీలోని సెంట్రల్ బస్ స్టాండ్‌లో ప్రయాణికుల మీదకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
బస్సు టైర్ల కింద పడి రెండేళ్ల బాలుడు అక్కడిక్కడే మృతిచెందగా, గాయాలపాలైన పలువురు ప్రయాణికులు pic.twitter.com/a2fE02umOZ
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2026