Bomb Threat | హైదరాబాద్ ఎయిర్‌పోర్టు (Hyderabad Airport)కు వచ్చే విమానాలకు వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తోన్న ఓ విమానానికి ఇలాంటి బెదిరింపే వచ్చింది. అయితే, విమానం ఇవాళ ఉదయం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
EK526 ఎమిరేట్స్ ఫ్లైట్ (Emirates Flight EK526) ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. ఈ క్రమంలో విమానాన్ని పేల్చేస్తామంటూ ఉదయం 7:30 గంటల సమయంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన కస్టమర్ సపోర్ట్ కేంద్రానికి ఈమెయిల్ వచ్చింది. ఈ బెదిరింపు మెయిల్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టు వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. ఉదయం 8:30 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
అనంతరం అందులోని ప్రయాణికులను కిందకు దింపి తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ మేరకు ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, గురువారం కూడా దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ విమానానికి ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. ఇలా వరుస బెదిరింపులతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
Hyderabad, Telangana | On 5th December 2025, a bomb threat email was received on the Hyderabad airport customer support ID at 7:30 am for the Dubai (DXB) to Hyderabad (HYD) flight EK526. The Flight landed safely in HYD at 8:30 am. Standard safety protocols were initiated.…
— ANI (@ANI) December 5, 2025
Also Read..
IndiGo | ఇండిగోలో సంక్షోభం.. విమాన టికెట్ ధరలకు రెక్కలు..!
Rahul Gandhi | ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. ఇండిగో వైఫల్యంపై రాహుల్
IndiGo | వరుసగా నాలుగోరోజూ.. 400కిపైగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు.. ప్రయాణికులకు తప్పని అవస్థలు