Bomb threat | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో బాంబు బెదిరింపులు (Bomb threat) మరోసారి కలకలం రేపాయి. ఇటీవలే నగరంలోని పలు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ హైకోర్టుకు (Delhi High Court) బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టులో బాంబులు పెట్టినట్లు ఈమెయిల్ వచ్చింది. కోర్టు ప్రాంగణంలో మూడు బాంబులను అమర్చామని, మరికాసేపట్లో అవి పేలుతాయంటూ అందులో బెదిరించారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు ఖాళీ చేయాలని సూచించారు. అయితే, పేలుడు పదార్థాలు ఎక్కడెక్కడ పెట్టారన్నది అందులో పేర్కొనలేదు. ఈ బెదిరింపు మెయిల్‌తో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకున్నారు.
ముందు జాగ్రత్త చర్యగా కోర్టులోని న్యాయమూర్తులు (judges), న్యాయవాదులు, సిబ్బందిని బయటకు పంపించారు. అనంతరం తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ బెదిరింపులతో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి.
#WATCH | Delhi | Delhi High Court receives a bomb threat via mail. Precautionary measures taken by the Delhi police and the court has been vacated. https://t.co/7mQhpAsLsU pic.twitter.com/IYOFFbna4n
— ANI (@ANI) September 12, 2025
Also Read..
Donald Trump | సుంకాల వివాదం వేళ.. ఈ ఏడాది చివర్లో భారత్‌కు ట్రంప్..?
Sergio Gor | భారత్‌ను చైనాకు దూరం చేసి.. యూఎస్‌కు దగ్గర చేసుకోవడమే మా ప్రాధాన్యం : అమెరికా రాయబారి