Sergio Gor | భారీ సుంకాలతో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు (India- US Ties) దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఇదే సమయంలో చైనా, రష్యాకు న్యూఢిల్లీ దగ్గరవుతోంది. ఈ అంశం అమెరికా అధికారులకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో భారత్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదం వేళ భారత్‌కు కాబోయే అమెరికా రాయబారి సెర్గీ గోర్ (Sergio Gor) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను చైనాకు దూరం చేసి (India Away From China) యూఎస్‌కు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యమన్నారు.
విలేకరులతో సెర్గీ గోర్ మాట్లాడుతూ.. ‘భారత్‌ను యూఎస్ వైపునకు తీసుకురావడం అత్యంత ముఖ్యమైన విషయం. ఇందులో భాగంగా న్యూ ఢిల్లీని చైనా నుంచి దూరం చేయాలి. మా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్ఎన్జీ కోసం భారత్ ప్రధాన మార్కెట్ కావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఆ దిశగానే సాగుతున్నాయి’ అని తెలిపారు. అమెరికా మొత్తం జనాభా కంటే భారత్‌లో మధ్య తరగతి ప్రజలే ఎక్కువ అని అన్నారు. ఆ దేశ మార్కెట్ అమెరికాకు అపారమైన అవకాశాలను అందిస్తుందని వివరించారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
భారత ప్రభుత్వం, అక్కడి ప్రజలతో అమెరికా సంబంధాలు దశాబ్దాల నాటివని ఈ సందర్భంగా సెర్గీ గోర్ గుర్తు చేశారు. చైనీయులతో కంటే అమెరికా ప్రజలతోనే వారికి గొప్ప స్నేహం ఉందని అభిప్రాయపడ్డారు. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal), ఇతర ప్రతినిధులను ట్రంప్ అమెరికాకు ఆహ్వానించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వారు అమెరికా వాణిజ్య ప్రతినిధితో సమావేశమవుతారని, ఈ సమావేశంలో ఆశించదగిన ఒప్పందం జరిగే అవకాశం ఉందని చెప్పారు.
Also Read..
Jagdeep Dhankhar | ఎట్టకేలకు కనిపించారు.. రాజీనామా తర్వాత తొలిసారి బయటకొచ్చిన ధన్‌ఖడ్
CP Radhakrishnan | ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం.. హాజరైన ధన్‌ఖడ్
హెచ్-1బీ వాడకంలో 56శాతం కోత.. స్థానిక ఉద్యోగుల వైపే భారత ఐటీ దిగ్గజాల మొగ్గు