CP Radhakrishnan | భారత 15వ ఉపరాష్ట్రపతి (Vice President)గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ప్రమాణ స్వీకారం చేశారు (Take Oath). శుక్రవారం ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhawan)లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు.
#WATCH | C.P. Radhakrishnan takes oath as the 15th Vice President of India. President Droupadi Murmu administers the Oath of Office to him.
(Video Source: DD) pic.twitter.com/I91ezMHd2w
— ANI (@ANI) September 12, 2025
ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, పియూష్ గోయెల్, ధర్మేంద్ర ప్రదాన్ సహా పలువురు కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ఎన్డీయే కూటమికి చెందిన నేతలు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్‌ఖడ్, వెంకయ్యనాయుడు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా హాజరయ్యారు.
#WATCH | Delhi: Vice President-elect C.P. Radhakrishnan to take Oath of Office shortly. Former Vice President Jagdeep Dhankhar is also present at the ceremony which will begin shortly.
(Video: DD) pic.twitter.com/tgMU5cWHWi
— ANI (@ANI) September 12, 2025
ఇటీవలే జరిగిన ఉపరాష్ట్రపతి (Vice-President) ఎన్నికల్లో రాధాకృష్ణన్ గెలుపొందిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఎన్నికలో ఆయనకు 452 ఓట్లు రాగా, విపక్షానికి చెందిన ఆయన ప్రత్యర్థి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు లభించాయి. 152 ఓట్ల తేడాతో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న మహారాష్ట్ర గవర్నర్ (Maharashtra Governor) పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. గుజరాత్ గవర్నర్ (Gujarat Governor) ఆచార్య దేవవ్రత్కు (Acharya Devvrat) మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Veep2
ఆర్ఎస్ఎస్, జన్‌సంఘ్ లాంటి సంస్థలతో 16 ఏండ్లకే రాధాకృష్ణన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా, 2003 నుంచి 2006 మధ్య అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన రాష్ట్రంలో 93 రోజుల పాటు 19 వేల కి.మీ రథయాత్ర నిర్వహించారు. 2024, జూలై 31న ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్‌గా ఏడాదిన్నర పాటు చేశారు. తెలంగాణ ఇన్చార్జి గవర్నర్‌గా, పుదుచ్చెరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గానూ పనిచేశారు. 1998, 1999లో కోయంబత్తూర్ నుంచి ఆయన రెండుసార్లు ఎంపీగా చేశారు. అభిమానులు ఆయనను తమిళనాడు మోదీగా పిలుస్తారు.
Also Read..
హెచ్-1బీ వాడకంలో 56శాతం కోత.. స్థానిక ఉద్యోగుల వైపే భారత ఐటీ దిగ్గజాల మొగ్గు
ఐటీపై హైర్ పిడుగు!.. ఔట్ సోర్సింగ్ సంస్థలపై 25 శాతం పన్నుకు అమెరికా సిద్ధం