Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) ఎట్టకేలకు దర్శనమిచ్చారు. ఉపరాష్ట్రపతి (Vice President)గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రాజీనామా అనంతరం ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. ప్రొటోకాల్ ప్రకారం.. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
#WATCH | Delhi: Vice President-elect C.P. Radhakrishnan to take Oath of Office shortly. Former Vice President Jagdeep Dhankhar is also present at the ceremony which will begin shortly.
(Video: DD) pic.twitter.com/tgMU5cWHWi
— ANI (@ANI) September 12, 2025
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జూలై 21న రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ధన్‌ఖడ్ రాజీనామాపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. మరోవైపు రాజీనామా తర్వాత నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. ఆయన్ని సంప్రదించలేకపోయారు.
దీంతో ‘జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడ..?’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ధన్‌ఖడ్ గృహనిర్బంధంలో (House Arrest)లో ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ధన్‌ఖడ్‌ను తాము చేరుకోలేకపోతున్నామని, ఆయన ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రాజీనామా చేసినప్పటి నుంచి ధన్‌ఖడ్ గురించి ఎలాంటి సమాచారం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయన భద్రతపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ధన్‌ఖడ్‌కు ఏం జరిగింది..? ఆయన క్షేమంగానే ఉన్నారా? ఆరోగ్యంగానే ఉన్నారా..? అని ప్రశ్నించారు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ ఎంపీలు ప్రయత్నించినట్లు చెప్పారు. కానీ, ఆయన్ని చేరుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ఆయన ప్రస్తుత లొకేషన్ ఏంటి? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది?వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో జూలై 21 రాజీనామా తర్వాత అదృష్యమైన ధన్‌ఖడ్.. ఇప్పుడు రాష్ట్రపతి భవన్లో జరిగిన అధికారిక కార్యక్రమానికి హాజరై తనపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.
Also Read..
CP Radhakrishnan | ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం.. హాజరైన ధన్‌ఖడ్
హెచ్-1బీ వాడకంలో 56శాతం కోత.. స్థానిక ఉద్యోగుల వైపే భారత ఐటీ దిగ్గజాల మొగ్గు