Donald Trump | రష్యా చమురు (Russia Oil) కొనుగోలు కారణం చూపి ట్రంప్ విధించిన భారీ సుంకాలతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సుంకాల వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ (Donald Trump) ఈ ఏడాది చివర్లో భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్‌లో భారత్‌లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు భారత్‌కు కాబోయే అమెరికా రాయబారి సెర్గీ గోర్ (Sergio Gor) వెల్లడించారు. ఈ సదస్సు కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని వివరించారు.
2017లో భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్ (Quad) కూటమిని ఏర్పాటు చేశాయి. నాలుగు అగ్రదేశాలతో ఏర్పడిన కూటమి అధినేతలు 2021 సెప్టెంబరు 24న వాషింగ్టన్లో తొలిసారి భేటీ అయ్యారు. ఇక గతేడాది సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. ఈ సారి క్వాడ్ దేశాధినేతల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. నవంబరులో న్యూ ఢిల్లీలో జరగబోయే సదస్సుకు ఆయా దేశాధినేతలు హాజరుకానున్నారు. ఈ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ ఏడాది జనవరిలో అమెరికాలో జరిగిన విషయం తెలిసిందే.
Also Read..
Sergio Gor | భారత్‌ను చైనాకు దూరం చేసి.. యూఎస్‌కు దగ్గర చేసుకోవడమే మా ప్రాధాన్యం : అమెరికా రాయబారి
Jagdeep Dhankhar | ఎట్టకేలకు కనిపించారు.. రాజీనామా తర్వాత తొలిసారి బయటకొచ్చిన ధన్‌ఖడ్
Jagdeep Dhankhar | ఎట్టకేలకు కనిపించారు.. రాజీనామా తర్వాత తొలిసారి బయటకొచ్చిన ధన్‌ఖడ్