Sikkim | ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)లో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి వరదలు సంభవించాయి. అనేక చోట్ల కొండచరియలు (landslide) విరిగిపడ్డాయి. గ్యాల్షింగ్ (Gyalshing) జిల్లాలోని అప్పర్ రింబి (Upper Rimbi)లో గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ సిక్కింలోని యాంగ్థాంగ్ (Yangthang) ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు.
#WATCH | Sikkim | Four dead and three missing after a landslide in Upper Rimbi under the Yangthang Constituency in West Sikkim at midnight. Three individuals were killed on the spot when the landslide hit. The police team, in coordination with local villagers and SSB personnel,… https://t.co/wafkzs0Qiw pic.twitter.com/xQtanW71fW
— ANI (@ANI) September 12, 2025
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. హ్యూమ్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిపై చెట్టు దుంగతో తాత్కాలిక వంతెనను నిర్మించింది. ఆ వెంతన ద్వారానే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Late night and morning visuals from Sikkim, where a landslide in Upper Rimbi in the Gyalshing district claimed the lives of 4 people.#Sikkim https://t.co/aCQGHJbR4T pic.twitter.com/nGvzhRQY2O
— Vani Mehrotra (@vani_mehrotra) September 12, 2025
Also Read..
Donald Trump | సుంకాల వివాదం వేళ.. ఈ ఏడాది చివర్లో భారత్‌కు ట్రంప్..?
Sergio Gor | భారత్‌ను చైనాకు దూరం చేసి.. యూఎస్‌కు దగ్గర చేసుకోవడమే మా ప్రాధాన్యం : అమెరికా రాయబారి
Jagdeep Dhankhar | ఎట్టకేలకు కనిపించారు.. రాజీనామా తర్వాత తొలిసారి బయటకొచ్చిన ధన్‌ఖడ్