Odisha train accident | నెల గడిచిపోయింది. ఇంకా 42 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది
Odisha Train Accident | భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. . ఈ ఘటన జరిగి నెలరోజులు గడిచినా.. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతం 42 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.
Odisha train accident | భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. గత నెల 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ (Bahanaga Bazar railway station) సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న (Triple train accident) విషయం తెలిసిందే. ఈ ఘటనలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగి నెల రోజులు గడిచిపోయింది. అయినా, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మాత్రం ఇంకా పూర్తికాలేదు. చనిపోయిన వారిలో ఇంకా 42 మందికి సంబంధించిన వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు.
ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అందులో కొన్నింటిని గుర్తించి వారివారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన 81 మృతదేహాలకు ఇటీవలే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. అందులో 39 మంది మృతదేహాలను గుర్తించి వాటిని దహన సంస్కారాల నిమిత్తం వారి కుటుంబాలకు అప్పగించారు. ప్రస్తుతం 42 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.
ఆ 42 మృతదేహాలకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు. వారి బంధువులు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం వాటిని భువనేశ్వర్ ఎయిమ్స్ మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఆ డెడ్ బాడీస్ కు నిర్వహించిన డీఎన్ఏ రిపోర్ట్స్ త్వరలో రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
Devagiri Express | పట్టాలపై రాళ్లతో నింపిన డ్రమ్ము.. దేవగిరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం
Noida School | క్రమ శిక్షణ పేరుతో విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్..
Ravindra Jadeja | మహీ భాయ్.. ఈ ప్రయాణం ఎప్పటికీ నీతోనే : వైరలవుతున్న జడేజా పోస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

