Noida School | క్రమ శిక్షణ పేరుతో విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్..
Noida School | క్రమ శిక్షణ (Discipline) పేరుతో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించింది. ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు జుట్టు కత్తిరించుకోవడంలేదని.. తానే స్వయంగా కత్తెర పట్టి పలువురు విద్యార్థుల జుట్టు కత్తిరించేసింది (Cuts Hair).
Noida School | క్రమ శిక్షణ (Discipline) పేరుతో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించింది. ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు జుట్టు కత్తిరించుకోవడంలేదని.. తానే స్వయంగా కత్తెర పట్టి పలువురు విద్యార్థుల జుట్టు కత్తిరించేసింది (Cuts Hair). దీనిపై బాలికల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 168లో శాంతి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు ఉపాధ్యాయురాలు పాఠశాలలో క్రమశిక్షణ అధికారిణిగా పనిచేస్తోంది. కాగా, గత కొంత కాలంగా విద్యార్థులు జుట్టు కత్తిరించుకొని పాఠశాలకు రావాలని సూచించింది. అయితే విద్యార్థులు మాత్రం ఆమె చెప్పిన మాటలు వినిపించుకోవట్లేదు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన ఉపాధ్యాయురాలు.. స్వయంగా కత్తెర పట్టుకుని 15 మంది విద్యార్థుల జుట్టును కత్తిరించేసింది.
ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పాఠశాలకు చేరుకొని యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. సదరు ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ టీచర్ ను స్కూల్ మేనేజ్ మెంట్ సస్పెండ్ చేసినట్లు నోయిడా అడిషనల్ డీసీపీ శక్తి అవస్థి తెలిపారు.
Also Read..
Ravindra Jadeja | మహీ భాయ్.. ఈ ప్రయాణం ఎప్పటికీ నీతోనే : వైరలవుతున్న జడేజా పోస్ట్
Rare Brain Infection | కేరళలో బయటపడిన అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేసు..
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోకాలికి శస్త్రచికిత్స
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

