Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి శస్త్ర చికిత్స (Surgery) జరిగింది. గతవారం దీదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మమత ఎడమ మోకాలి (Left Knee) కి గాయం అయింది. దీంతో శస్త్ర చికిత్స అవసరం ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు.
ఈ మేరకు గురువారం కోల్ కతాలోని ఎస్ఎస్ కేఎమ్ (SSKM) ఆసుపత్రిలో వైద్యులు దీదీకి శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆమెను డిశ్చార్జి చేసి ఇంటికి పంపారు. ‘ప్రస్తుతం సీఎం ఆరోగ్యం మెరుగ్గా ఉంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి చికిత్స కోసం సీఎంకు సమాచారం ఇస్తాం’ అని సీనియర్ వైద్యుడు తెలిపారు.
Also Read..
Krithi Shetty | స్టార్ హీరో కొడుకు వేధించాడంటూ వార్తలు.. స్పందించిన కృతి శెట్టి
Twitter Vs Threads | పోటీ మంచిదే.. మోసం కాదు.. థ్రెడ్స్‌పై దావా వేస్తాం: ట్విట్టర్
Tomato Price | రూ.160 దాటిన కిలో టమాట ధర.. గంగోత్రి ధామ్‌లో అయితే..