Krithi Shetty | తొలి సినిమా ‘ఉప్పెన’తో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది మంగళూరు సోయగం కృతి శెట్టి (Krithi Shetty). ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ ఈమెకు దక్కుతుంది. బేబమ్మగా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్ లక్కి చార్మ్ అయిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో బేబమ్మ గురించి కొన్ని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఓ స్టార్ హీరో కొడుకు కృతి శెట్టిని నిరంతరం వేధిస్తున్నాడని ప్రచారం జరిగింది. తనతో స్నేహం చేయమని విసిగించేవాడని కృతి ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు పలు వెబ్ సైట్లలో కథనాలు వచ్చాయి. అతడు వెళ్లిన ప్రతీ కార్యక్రమానికి నటిని రమ్మనే వాడంటూ వరుస కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలపై తాజాగా నటి స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, దయచేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఆపండి అంటూ ట్విట్టర్ లో పేర్కొంది. ‘అసత్య ప్రచారాలు చేయడం మానండి. ఇది నిరాధారమైన పుకారు కాబట్టి దాన్ని పట్టించుకోకూడదని మొదట అనుకున్నా. కానీ ఈ ప్రచారం మరింతగా వ్యాపిస్తున్నందున స్పందించక తప్పడం లేదు. దయచేసి ఇలాంటి కథనాలు ప్రచారం చేయడాన్ని ఆపండి’ అని తెలిపింది.
ప్రస్తుతం కృతి శెట్టి మలయాళంలో టివోనో థామస్ హీరోగా నటిస్తున్న ‘అజయ రాండం మోషణం’ (Ajayante Ramdam Moshanam) సినిమాలో నటిస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా. దీంతోపాటు తమిళంలో జయం రవి (Jayam Ravi) హీరోగా నటిస్తున్న ‘జీని’ (Genie) సినిమాలోనూ కృతి శెట్టి హీరోయిన్గా ఎంపికైంది.
Also Read..
Twitter Vs Threads | పోటీ మంచిదే.. మోసం కాదు.. థ్రెడ్స్ పై దావా వేస్తాం : ట్విట్టర్
Rangabali Review | రంగబలి ఎలా ఉంది.. ప్రీమియర్ షో టాక్..
Tomato Price | రూ.160 దాటిన కిలో టమాట ధర.. గంగోత్రి ధామ్‌లో అయితే..