Twitter Vs Threads | పోటీ మంచిదే.. మోసం కాదు.. థ్రెడ్స్‌పై దావా వేస్తాం: ట్విట్టర్
Twitter Vs Threads | ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (Meta) ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ యాప్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే న్యాయపరమైన సమస్యల్లో పడింది.
Twitter Vs Threads | ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter)కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (Meta) ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ యాప్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే న్యాయపరమైన సమస్యల్లో పడింది. మెటా ‘థ్రెడ్స్’ యాప్ తమ ‘మేథో సంపత్తి హక్కులను’ (intellectual property rights) ఉల్లంఘించిందని ట్విట్టర్ ఆరోపించింది. థ్రెడ్స్‌పై దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg)కు.. ఎలాన్ మస్క్ న్యాయవాది అలెక్స్ స్పిరో (Alex Spiro) లేఖ రాశారు.
లేఖలో మెటాపై ట్విట్టర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను మెటా నియమించుకుందని తెలిపింది. మెటా నియమించుకున్న ఆ ఉద్యోగులంతా ట్విట్టర్ యొక్క వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారన్ని కలిగి ఉన్నారని లేఖలో పేర్కొంది. ‘ట్విట్టర్ తన మేధో సంపత్తి హక్కులను పక్కాగా అమలు చేయాలనుకుంటోంది. ట్విట్టర్ వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత సమాచారాన్ని ఉపయోగించకుండా మెటా తక్షణ చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో డిమాండ్ చేసింది. దీనిపై మెటా స్పందించింది. థ్రెడ్స్ లోని ఇంజినీరింగ్ బృందంలో ఎవరూ ట్విట్టర్ మాజీ ఉద్యోగులు లేరని పేర్కొంది. మరోవైపు ఈ పరిణామాలపై ట్విట్టర్ అధినేత మస్క్ స్పందించారు. ‘పోటీ మంచిదే.. మోసం కాదు’ అని పేర్కొన్నారు.
మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్‌కు పోటీగా ఇటీవల మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) కొత్త యాప్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెటా కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ‘థ్రెడ్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ అందుబాటులోకి వచ్చీ రాగానే సంచలనాలు సృష్టింస్తోంది. యాప్‌ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఖాతాలు తెరవగా.. నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు పెరిగింది. ఇక ఏడు గంటల్లోనే కోటి మందికి పైగా యూజర్లు థ్రెడ్స్ యాప్‌లో ఖాతాలు తెరవడం విశేషం. ఇక ఒక్కరోజులోనే 3 కోట్లకు పైగా యూజర్లను సొంతం చేసుకుంది.
Also Read..
Tomato Price | రూ.160 దాటిన కిలో టమాట ధర.. గంగోత్రి ధామ్‌లో అయితే..
San Francisco: శాన్ఫ్రాన్సిస్కో ఘటనను ఖండించిన అమెరికా ప్రజాప్రతినిధులు
Health Tips | 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా ? వ్యాయామం చేసేముందు ఈ విషయం తెలుసుకోవాలి!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

