Health Tips | న్యూఢిల్లీ: ఆరుగంటల కంటే తక్కువ నిద్రపోయేవారు శారీరక శ్రమ చేసినా జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. శారీరక శ్రమ, నిద్ర మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయని లండన్ పరిశోధకులు గుర్తించారు. 50 ఏండ్లు పైబడిన 8, 958 మందిపై పదేండ్లపాటు అధ్యయనం నిర్వహించారు.
అధిక శారీరక శ్రమ చేస్తూ ఆరు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్నారో.. వారి జ్ఞాపకశక్తి వేగంగా క్షీణిస్తున్నదని, ఇది శారీరక శ్రమ చేయని వారితో సమానంగా ఉంటున్నదని తేల్చారు. కంటినిండా నిద్ర ఉంటేనే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన మైకేలా బ్లూమ్బర్గ్ పేర్కొన్నారు.