వాషింగ్టన్: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో(San Francisco)లో ఉన్న భారతీయ కౌన్సులేట్‌కు ఖలిస్తానీ మద్దతుదారులు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనను అమెరికా ప్రజాప్రతినిధులతో పాటు భారతీయ అమెరికన్ల కూడా ఖండించారు. ఖలిస్తానీలు క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. భారతీయ అంబాసిడర్ తరణ్‌జిత్ సింగ్ సందూ పట్ల ఖలీస్తానీలు వ్యవహరించిన తీరును కూడా ప్రజాప్రతినిధులు తప్పుపట్టారు. భావ స్వేచ్ఛ అంటే విధ్వంసానికి దిగడం కాదన్నారు. ప్రాపర్టీలను ధ్వంసం చేయడం కాదన్నారు. శాన్ఫ్రాన్సిస్కో కౌన్సులేట్‌కు నిప్పుపెట్టిన వీడియోను ఖలీస్తానీ మద్దతుదారులు జూలై రెండో తేదీన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
కెనడాలో ఖలిస్తానీ టైగర్ ఫోర్స్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలో శాన్ఫ్రాన్సిస్కో కౌన్సులేట్పై అటాక్ చేశారు. నిజ్జార్ తలపై 10 లక్షల రివార్డు కూడా ఉంది. ఖలిస్తానీల హింసను ఖండిస్తూ ప్రజాప్రతినిధులు రో ఖన్నా, మైఖేల్ వాల్జ్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. దౌత్యకేంద్రాలపై హింసకు దిగడాన్ని సహించబోము అని పేర్కొన్నారు.