Devagiri Express | పట్టాలపై రాళ్లతో నింపిన డ్రమ్ము.. దేవగిరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం
Devagiri Express | ముంబై - సికింద్రాబాద్ (Mumbai-Secunderabad) మధ్య నడుస్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ (Devagiri Express) రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొందరు దుండగులు పట్టాలపై రాళ్లతో నింపిన డ్రమ్మును ఉంచారు. గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై అత్యవసర బ్రేకులు వేశారు (emergency brakes).
Devagiri Express | ముంబై – సికింద్రాబాద్ (Mumbai-Secunderabad) మధ్య నడుస్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ (Devagiri Express) రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొందరు దుండగులు పట్టాలపై రాళ్లతో నింపిన డ్రమ్మును ఉంచారు. గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై అత్యవసర బ్రేకులు వేశారు (emergency brakes). దీంతో పెను ప్రమాదం తప్పినట్లు దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ రైల్వే డివిజన్ పీఆర్ వో షిండే తెలిపారు. మహారాష్ట్ర (Maharashtra)లోని జల్నా (Jalna) జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు.
ముంబై నుంచి సికింద్రాబాద్ బయలుదేరిన రైలు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సతోనా – ఉస్మాన్ పూర్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో పట్టాలపై ఏదో వస్తువు ఉండటాన్ని లోకోపైలట్ గుర్తించారు. దీంతో ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. అనంతరం కిందకి దిగి చూడగా.. ట్రాక్ మధ్యలో రాళ్లతో నిండిన డ్రమ్ము కనిపించింది. ఈ విషయాన్ని లోకోపైలట్ వెంటనే రైల్వే భద్రతా అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని డ్రమ్మును తొలగించారు. అనంతరం రైలు తిరిగి సికింద్రాబాద్ బయల్దేరింది. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను గుర్తించే పనిలో పడ్డారు.
Also Read..
Krithi Shetty | స్టార్ హీరో కొడుకు వేధించాడంటూ వార్తలు.. స్పందించిన కృతి శెట్టి
Noida School | క్రమ శిక్షణ పేరుతో విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్..
Ravindra Jadeja | మహీ భాయ్.. ఈ ప్రయాణం ఎప్పటికీ నీతోనే : వైరలవుతున్న జడేజా పోస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

