బుధవారం 03 మార్చి 2021
National - Jan 24, 2021 , 19:46:27

మైనారిటీల మెప్పు కోసం దీదీ తాపత్రయం : బీజేపీ

మైనారిటీల మెప్పు కోసం దీదీ తాపత్రయం : బీజేపీ

న్యూఢిల్లీ : కోల్‌కతాలో జరిగిన నేతాజీ జయంతి కార్యక్రమంలో జై శ్రీరాం నినాదాలు చేశారంటూ ప్రసంగించకుండా వెనుదిరిగిన పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీరును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్‌వర్గియ తప్పుపట్టారు. ఓ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకే దీదీ ఇలా చేశారని మండిపడ్డారు. బెంగాల్‌లో ౩౦ శాతంగా ఉన్న ఓ వర్గాన్ని ఆకట్టుకునేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని, మిగిలిన 70 శాతం ఓటర్లను మాత్రం విస్మరిస్తున్నారని బెంగాల్‌ బీజేపీ ఇన్‌చార్జ్‌ కూడా అయిన విజయ్‌ వర్గియ వ్యాఖ్యానించారు.

నేతాజీ 125వ జయంతి వేదికగా మమతా బెనర్జీ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ అజెండాను నిర్ధారించడం విచారకరమని అన్నారు. ప్రధాని వేదికపై ఉండగానే మమతా బెనర్జీ ప్రవర్తన అభ్యంతరకరమని ఇది మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు వేసిన ఎత్తుగడని దుయ్యబట్టారు. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన సభికులు జై శ్రీరాం నినాదాలు చేయడంతో ప్రభుత్వ కార్యక్రమంలో హుందాగా వ్యవహరించాలని, ఇది రాజకీయ సమావేశం కాదని అంటూ ప్రసంగించకుండానే మమతా బెనర్జీ వెనుతిరిగారు. 

VIDEOS

logo