BJP workers | హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly elections) ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఇక్కడ బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ కమలం పార్టీ 51 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దీంతో బీజేపీ శ్రేణులు (BJP workers) సంబరాలు షురూ చేశారు.
#WATCH | Haryana: BJP workers celebrate in Ambala, as counting continues. As per the latest EC data, the party is leading on 51 of the 90 seats. #HaryanaAssemblyElection2024 pic.twitter.com/TzfChy2lSE
— ANI (@ANI) October 8, 2024
పార్టీ అత్యధిక స్థానాల్లో లీడింగ్‌లో ఉండటంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు మొదలు పెట్టారు. అంబాలా (Ambala)లో పార్టీ జెండాలను చేతపట్టుకుని డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. మిఠాయిలు తినిపించుకున్నారు. కొన్ని చోట్ల బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
#WATCH | Haryana: BJP workers celebrate at party office in Ambala, as counting continues. As per the latest EC data, the party is leading on 51 of the 90 seats. pic.twitter.com/bINUniFCCn
— ANI (@ANI) October 8, 2024
Also Read..
Vinesh Phogat | జులానాలో వినేష్ ఫొగాట్ విజయం
Instagram Down | ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం
Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ చీఫ్ రవీందర్ రైనా ఓటమి !